
పయనించే సూర్యుడు మార్చి 12 కరీంనగర్ న్యూస్: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా కరీంనగర్ లో బుధవారం రోజు 19,20,21,22,23 డివిజన్లతో పాటు 40 వ డివిజన్ లో మేయర్ కొలగాని శ్రీనివాస్ పర్యటించారు. డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, పలువురు కార్పోరేటర్లతో నగరపాలక సంస్థ నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మొదటగా 40 వ డివిజన్ హనుమాన్ నగర్ ప్రాంతంలో స్థానిక కార్పోరేటర్ నలువాల పష్పలత రవీంధర్ తో కలిసి 5 లక్షల నిధులతో డ్రైనేజీ నిర్మాణం పనులకు భూమీ పూజ చేశారు. 22 వ డివిజన్ విద్యానగర్ లో డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, స్థానిక కార్పోరేటర్ బండ రమణారెడ్డి తో కలిసి 30 లక్షల నిధులతో పలు డ్రైనేజీ, కల్వర్టుల నిర్మాణం పనులకు భూమీ పూజ చేసి పనులు ప్రారంభించారు. 21 వ డివిజన్ శ్రీరాంనగర్ కొత్త యాసువాడ లో కార్పోరేటర్ వరాల నర్సింగంతో కలిసి 10 లక్షల నిధులతో ఆర్ సీసీ పైపులైన్ అభివృద్ధి పనులకు భూమీ పూజ చేసి పనులు ప్రారంభించారు. 19 వ డివిజన్ రేకుర్తిలో డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, స్థానిక కార్పోరేటర్ సుధగొని మాధవి కృష్ణ గౌడ్ తో కలిసి 5 లక్షలతో డ్రైనేజీ నిర్మాణం పనులకు భూమీ పూజ చేశారు. 20 వ డివిజన్ రేకుర్తి బృందావన కాలనీలో కార్పోరేటర్ పర్వతం మల్లేషంతో కలిసి 5 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణం కు భూమి పూజ చేశారు. అనంతరం 23 వ డివిజన్ సీతారాంపూర్ లో కార్పోరేటర్ గుమ్మడి రాజ్ కుమార్ తో కలిసి 17.50 లక్షల నిధులతో సీతారాంపూర్ ప్రాథమిక పాఠశాల పహారి గోడ నిర్మాణం పనులకు భూమీ పూజ చేశారు. అనంతరం పాఠశాల, అంగన్వాడీ కేంద్రం ను సందర్శించి విద్యార్థులను కలిశారు. పాఠశాలలో ఉపాధ్యాయులను విద్యార్థులకు బోధిస్తున్న వివరాలను, మద్యాహ్నం భోజనం అందిస్తున్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సూర్యానగర్ కాలనీ 27 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం పనులకు భూమీ పూజ చేసి… పనులు ప్రారంభించారు. డవిజన్ల వారిగా చేపట్టిన పనులు వెంట వెంటనే ప్రారంభించి… వేగవంతం పూర్తి చేసేలా ఇంజనీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు సంబంధిత డివిజన్లలో నిర్వహించడం జరిగింది. మేయర్ కొలగాని శ్రీనివాస్ డివిజన్ లలో పలు డ్రైనేజీ సమస్యలు, రోడ్ల సమస్యలు తనిఖీ పరిశీలించారు. డివిజన్ లలో పారిశుధ్య కార్యక్రమాల్లో భగంగా డ్రైనేజీలలో సిల్టును తొలగించడంతో పాటు ఖాళీ స్థలాలు, పరిసర ప్రాంతాలను కార్మికులతో శుభ్రం చేయించారు. ఈ సంధర్బంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ శివారు ప్రాంతాలు విలీన గ్రామాల డివిజన్లలో అధిక సమస్యలు ఉంటాయని వాటిని దశల వారిగా మా పాలకవర్గంలో పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా 66 డివిజన్ లలో ప్రాధాన్యత గా పారిశుధ్య పనులు, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. అంతే కాకుండా త్రాగ నీటి సరఫరా లో లీకేజీలను అరికట్టి వీది దీపాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కొత్తగా ప్రజలకు అవసరమైన చోట వీది దీపాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వేసవి కాలం త్రాగు నీటి సమస్య రాకుండ సమ్మర్ ఆక్షన్ ప్లాన్ రూపొందించి ప్రణాళిక ప్రకారం తాగు నీటికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. విలీన గ్రామాల డివిజన్లలో అమృత్ 2.0 పనులను చేపడుతున్నామని త్వరలోనే పనులు పూర్తి చేసేలా చర్యలు తీస్కుంటున్నట్లు తెలిపారు. డివిజన్ల వారిగా ప్రజలు నగరపాలక సంస్థ చేపట్టే పనులకు సహాకరించాలని పిలుపు నిచ్చారు. మన పరిసరాలను పరిశుభ్రం చేస్కుంటేనే… ఆరోగ్యంగా జీవిస్తామని ప్రజలు మీ చుట్టు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపు నిచ్చారు. డివిజన్ వారిగా ప్రజలు మా దృష్ఠికి తెస్తున్న సమస్యలను దశల వారిగా పరిష్కరించేలా మా పాలకవర్గం పని చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పోరేటర్లు, మాజీ కార్పోరేటర్లు, ఇంజనీరింగ్, సానిటేషన్ అధికారులు పాల్గొన్నారు.