బోధన్ మైనార్టీ గురుకుల పాఠశాలలో ఘనంగా ఇఫ్తార్ విందు.

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 12 బోధన్ : రంజాన్ పండుగను పురస్కరించుకొని ఉపవాస దీక్షల సందర్భంగా బుధవారం బోధన్ మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలలో ఇఫ్తార్ విందును ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బోధన్ పురపాలక సంఘం చైర్ పర్సన్ తూము పద్మావతి శరత్ రెడ్డి మరియు వైస్ చైర్మన్ మీర్ ఇలియాస్అలీ,కౌన్సిలర్లు,ఆర్ఎంసి బషీర్,విజిలెన్స్ అధికారి జియా హాజరై ఉపవాస దీక్షలు చేపట్టిన విద్యార్థులకు పండ్లు తినిపించి ఉపవాస దీక్షలను విరమింపజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ పద్మజ,ఉపాధ్యాయ బృందం,విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *