నాగర్ కర్నూల్ 22వ వార్డులో నూతన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి

పయనించే సూర్యుడు మార్చి 12 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని 22వ వార్డ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలో విద్యుత్ సరఫరా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్ అందించేందుకు అవసరమైన మౌలిక వసతులను దశలవారీగా అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు వల్ల 22వ వార్డ్ పరిధిలో ఉన్న ప్రజలకు విద్యుత్ ఒత్తిడి తగ్గి మెరుగైన సరఫరా అందుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసినందుకు స్థానిక ప్రజలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు, మునిసిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, వైస్ చైర్మన్ బాదం రమేష్, కౌన్సిలర్ మాధవి రాజు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు మరియు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *