
పయనించే సూర్యుడు మార్చి 12, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం ఉప్పలంక గ్రామానికి చెందిన కర్రీ సతీష్ ఆదిలక్ష్మి దంపతుల కు ముగ్గురు ఆడపిల్లలు మొదటి కుమార్తె కర్రీ దుర్గా భవాని కి పుట్టినప్పుడు నుంచే రెండు కాళ్లు పాదాలు వెన్న తిరిగి ఉండడంతో అప్పటినుంచి ఇబ్బందులు పడుతూ స్కూల్ కి వెళ్తుంది అయితే తను నడిచేటప్పుడు విపరీతమైన బాధ నొప్పి రావడంతో డాక్టర్ సంప్రదించగా ఆపరేషన్ చేస్తే రెండు కాళ్ల పాదాలు సరి చేయవచ్చని రెండు లక్షల ఖర్చు అవుతుందని తెలియపరిచారు దీంతో హెల్పింగ్ హాండ్స్ అధినేత అనుసూరి శ్రావణి కలవగా ఆమె సహకరిస్తానని అయితే అందరూ తలో చేయి వేస్తే పాప ఆపరేషన్‌కు సుఖాంతం అవుతుందని అన్నారు. అయితే మా చైర్మన్ విటల్ రెడ్డి ఆదేశాలతో ముందుకు వెళ్తామని వారికి మా వంతు సహకారం అందిస్తామని అన్నారు. ముగ్గురు ఆడపిల్లలు తెలిసి తండ్రి పరారయ్యాడని పిల్లల బాగోగులను చిన్నమ్మ అయినా గంటాడి నూక రత్నం చూసుకోవడం జరుగుతుందని అయితే రెక్క ఆడితే గాని డొక్కా ఆడని వీరు పరిస్థితిలకు ముగ్గురు ఆడపిల్లలు తో అద్దె కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని మీడియా ద్వారా తెలియజేశారు. అయితే ఎమ్మెల్యే పంతం నానాజీకి విషయం తెలియజేస్తే ప్రభుత్వం నుండి సహకారం అందుతుంది ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హెల్పింగ్ హాండ్స్ సభ్యులు సునీత ఉమామహేశ్వరి కొప్పిశెట్టి వీరబాబు, సూర్య నరేష్, హర్ష, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. స్పందించిన ఎమ్మెల్యే నానాజీ. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 9 సంవత్సరాల చిన్నారి దుర్గ భవానిని విషయాలు అడిగి తెలుసుకుని స్పందించారు ఎమ్మెల్యే నానాజీ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారి దుర్గ భవానికి అన్ని విధాల సహకరిస్తానని అరికాళ్ళను సరి చేసేందుకు ఆసుపత్రిలో ఖర్చు ఎంతవుతుంది తెలుసుకుని ప్రభుత్వపరంగా వచ్చే విధంగా సహకరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు.