తిమ్మాపురం హౌసింగ్ కాలనీకి మహర్దశ.. మూడు కోట్ల తో రోడ్లు నిర్మాణం చురుగ్గా సాగుతున్న పనులు.. అభివృద్ధికి ఆటంకాలు వస్తే సహించేది లేదు..ఎమ్మెల్యే నానాజీ..

పయనించే సూర్యుడు మార్చి 12, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం హౌసింగ్ కాలనీకి మూడు కోట్ల రూపాయలతో రోడ్ల అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయని ఎమ్మెల్యే పంతం నానాజీ తెలియజేశారు. ఆయన నివాసంలో పాత్రికేయులతో మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గం లో సుమారు 40 నుంచి 50 గ్రామాలు ఉన్నాయని ప్రతి సర్పంచ్ గ్రామ అభివృద్ధికి ముందుకు వెళ్తుంటే తిమ్మాపురం గ్రామం మాత్రం అభివృద్ధికి ఆటంకాలు కల్పిస్తున్నారని ఏది ఏమైనా గ్రామ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని నిధులు కేటాయించడం జరిగిందని అందులో భాగంగానే 8 కోట్ల రూపాయలతో గ్రామంలో అభివృద్ధి పనులు చేశామని ఇప్పుడు హౌసింగ్ కాలనీ కి మూడు కోట్ల రూపాయలను వెచ్చించి కాలనీ అంతటికీ రోడ్ల నిర్మాణాన్ని చురుకుగా కొనసాగిస్తున్నామని త్వరలోనే రోడ్లు నిర్మాణం పూర్తవుతుందని తరువాత డ్రైన్ల నిర్మాణాన్ని కూడా త్వరితగతిన చేపడుతామని ఎమ్మెల్యే అన్నారు. గ్రామానికి లింక్ రోడ్డు వేస్తే దానిని కూడా వేలెత్తి చూపటం బాధాకరమన్నారు లింకు రోడ్డు ద్వారా రెండు గ్రామా ప్రజలు సులభతనంగా వెళ్లడానికి మార్గం అవుతుందని అన్నారు. ప్రజలు మమ్మును ఎన్నుకోవడానికి వారికి అన్ని విదాలు అభివృద్ధి చేస్తామని ఉద్దేశంతో నేనని దాన్ని నిలబెట్టుకునే బాధ్యత మాకు ఉందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *