ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో గ్రామాలు అభివృద్ధి

* సర్పంచ్ కమటం మమత లక్ష్మణస్వామి

పయ నించే సూర్యుడు మార్చి 12 2026, నాగర్ కర్నూలు జిల్లా, కల్వకుర్తి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కమటోనీ పల్లి గ్రామానీ అన్ని విధాల అభివృద్ధి చేస్తానని సర్పంచ్ కమటం మమత లక్ష్మణస్వామి అన్నారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామంలో సర్పంచ్ ఆధ్వర్యంలో అని వీధులను మురికి కాలువలను శుభ్రం చేశారు. మంచినీటి వాటర్ ట్యాంకులను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా గ్రామంలో అనేక సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంటుందని అన్నారు. విడతలవారీగా గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి ఫయాజ్, ఉప సర్పంచ్ శివ కుమార్, గ్రామ వార్డు సభ్యులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *