ఆరో సారి టిటిడి వార్షిక ప్రతిభా సత్కారాన్ని అందుకున్న ఆలమూరు శైవాగమ పండితుడు ” కాళ్లకూరి

పయ నించే సూర్యుడు మార్చి 12 ముమ్మిడివరం ప్రతినిధి తిరుమల తిరుపతి దేవస్థానమువారు 1969లో ప్రారంభించిన వేద శాస్త్ర ఆగమ విద్వత్ సదస్సు ఈ సదస్సులో అన్ని శాస్త్రాల మీద అన్ని వేదాల మీద అన్ని ఆగమ శాస్త్రాల మీద ఆరు రోజులు విద్వత్ పరీక్షలు నిర్వహిస్తారు అప్పటినుంచి ఇప్పటివరకు మొత్తం 29 విద్వత్ సదస్సులు జరిగాయి అందులో భాగంగా 2006లో మన ఆలమూరు కి చెందిన శైవాగమ పండితుడు బ్రహ్మశ్రీ కాళ్ళకూరి సూరి పండు ( సూర్య శ్రీ ) ఈ పరీక్షలు రాసి ఉత్తీర్ణుడై ఆనాటి నుంచి టీటీడీ వర్షిక సత్కార పండితులుగా టీటీడీ వారి వార్షిక సత్కారాన్ని అందుకుంటూ అందులో భాగంగా ఈ సంవత్సరం 2026 మార్చి 10వ తేదీ టిటిడి వారిచే ఆరోసారి వార్షిక సత్కారాన్ని అందుకోవడం జరిగింది ఈ సందర్భంలో ఆలమూరు గ్రామస్తులు దాతలు పలువురు ఇలాంటి టీటీడీ సత్కారం ఆరోసారి అందుకోవడం ఆలమూరుకే గర్వకారణం అని ప్రశంసలు కురిపించిరి… ఈ సందర్భంలో కాసేపు మన ఆలమూరుకు చెందిన కాళ్ళకూరి సూరిపండు సహచర పండితులతో వేదపఠనం చేయడం కూడా జరిగింది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *