పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ మర్చి. 13.2026 కృష్ణమూర్తి. పోలవరం జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం, రంపచోడవరం మండలం ఐ.పోలవరం జంక్షన్ నందు భారత్ ఆదివాసి పార్టీ నాయకులతో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలిని చర్చించడం జరిగింది. మిగిలిన ఆరు మండలాల ఆదివాసి పెద్దలతో చర్చించి అ అ మండలాల మండల అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులు నియమించడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న మండల అధ్యక్షులు గ్రామ కమిటీలు పెట్టవలసిందిగా కోరుచున్నాను. ఆ సపోర్ట్ మీకు ఉంటుంది. ఆదివాసి సంఘాలు మరియు ఆదివాసి జేఏసీలు 100% సపోర్ట్ చేస్తానంటే భారత్ ఆదివాసి పార్టీ కలుపుకొని పోతుంది. ఎవరు కాదన్నా అవునన్నా”జిల్లా కమిటీ మీటింగ్” పార్టీ పెద్దల నిర్ణయం ప్రకారం మరో తేదీ ప్రకటించటం జరుగుతుంది. ఈ మీటింగ్ లోనే పార్టీ దిశ నిర్దేశం చేసుకుందాం. రాష్ట్రంలో కొత్త జిల్లా ఏర్పడినప్పుడు జిల్లా కమిటీ ఉంటుంది. పార్టీ ఇలాగే ఉండాలా పార్టీని పార్టీల నడిపించాలా నిర్ణయం మీ చేతుల్లో ఉంది.ఈ కార్యక్రమంలో భారత్ ఆదివాసి పార్టీ నాయకులు బేలo కొండబాబు, అన్నిక రాంబాబు, మడకం శ్రీనివాసు దొర పాల్గొనడం జరిగింది. జై ఆదివాసి. జై జై భారత్ ఆదివాసి పార్టీ.