
పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మార్చి 13 జగ్గయ్యపేట పట్టణం లో ఘనంగా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మహానేత వైఎస్ఆర్ చూపిన మార్గం జగన్ నాయకత్వం 16వ వసంతంలోకి అడుగుపెడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల నమ్మకాన్ని సంపాదించిందని తన్నీరు నాగేశ్వరరావు అన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గం కార్యాలయం నందు పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ ఫిరోజ్ ఆధ్వర్యంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథులుగా నియోజకవర్గ ఇన్చార్జ్ తన్నీరు నాగేశ్వరరావు పాల్గొన్నారు. ముందుగా డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి కి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు, నాయకులకు పార్టీ ఆవిర్భావ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కోదాడ రోడ్డులోని వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసే పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలిచిందని, రైతులు, మహిళలు, విద్యార్థులు, పేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ప్రభుత్వం జగన్ ప్రభుత్వమని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం ప్రజల గడప వద్దకు చేరిందని, ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న నాయకత్వం జగన్ దేనని అన్నారు. పార్టీకి కష్టకాలంలో అండగా నిలిచిన ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడికి, ప్రతి అభిమానికి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో జగ్గయ్యపేటను జగనన్నపేట గా మారుస్తాం. జగ్గయ్యపేట నియోజకవర్గ వ్యాప్తంగా 10,500 మంది వైఎస్ఆర్సిపి సైన్యం సిద్ధంగా ఉందని అన్నారు. ప్రజల కోస పేదల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయాణం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తూ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.