పయనించే సూర్యుడు న్యూస్ :మార్చి 13, తల్లాడ రిపోర్టర్ తమతోపాటు కలిసి చదువుకున్న చిన్ననాటి స్నేహితురాలకు స్నేహితులు అండగా నిలిచారు. అందరిని కోల్పోయూ స్థలం ఉండి ఇల్లు లేక ఇబ్బంది పడుతున్న స్నేహితురాలైన ప్రతిఫలం నకు పూర్వ విద్యార్థులు అందరి ఆలోచనతో కొంత వుండతాభక్తి సహాయంతో నగదు మొత్తంగా సేకరించిన డబ్బుతో ఒక గది నిర్మించి, రేకుల వరండాగా నిర్మించి, మౌలిక వసతుల ను ఏర్పాటు చేసి స్నేహితురాలికి బహుమతిగా అందించారు. తల్లాడ గవర్నమెంట్ హై స్కూల్ ల్లో 1991- 92 సంవత్సరంలో పదవ తరగతి చదువుకున్న మిత్రులు తన స్నేహితురాలు ప్రతిఫలం గత కొన్నేళ్లుగా తల్లాడ ఎన్టీఆర్ కాలనీలో నివసిస్తూ స్థలం ఉండి నిలువ గూడు లేక ఇబ్బంది పడుతుండగా విషయం తెలుసుకున్న తనతో పాటు కలసి చదువుకున్న స్నేహితులు ఆమెకు అండగా నిలిచారు.పూర్వ విద్యార్థులు సేకరించిన 65వేల నగదు తొ ఇల్లు నిర్మించిన ఇల్లును గురువారం గ్రాండ్ గా గృహప్రవేశం చేశారు.తనతో పాటు కలిసి చదువుకున్న స్నేహితులు అండగా నిలబడి తనకు నిలువ గూడు కల్పించినందుకు ప్రతిఫలం ఆనంద వ్యక్తం చేశారు. స్నేహితులను చూసి వారు చేసిన సహాయానికి ప్రతిఫలo భావోద్వేహానికి లోనైనా ప్రతీఫలంలో ఆనందనికి అవ్వదులో లేకపోలేదు.. గృహప్రవేశం సందర్భంగా విందులో పాల్గొన్న స్నేహితులు ఉత్సాహంగా డాన్సులు చేస్తూ, ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులను పలువురు అభినందించారు. ఈ సందర్భంగా మల్లారం సర్పంచ్ కిరణ్ తల్లాడ సర్పంచ్ పెరిక నాగేశ్వరావు లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు తరుపున ప్రతిఫలo నకు నూతన వస్రాలు సమర్పించారు. స్నేహితులు రాణి, గోవర్ధన్, త్రివేణి, రవి,వెంకట్, నగేష్, కిషోర్ తిరుమలరావు, మధు, హుస్సేన్, రాజు, శ్రీను, నరసింహారావు,వేణు,చారి బుచ్చారావు, లక్ష్మణ్ పాల్గొన్నారు.