జగిత్యాల జిల్లాస్థాయి అస్మిత కే లో ఇండియా క్రీడా పోటీల్లో సత్తా చాటిన రామాజీపేట్ విద్యార్థినీలు.

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ మార్చి 13 మామిడిపెల్లి లక్ష్మణ్ కేంద్ర యువజన&క్రీడ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అస్మిత కేలో ఇండియా జిల్లాస్థాయి కబడ్డీ పోటీల్లో రామాజీపేట్ ఉన్నత పాఠశాల విద్యార్థినిలు అండర్ 17 కబడ్డీ పోటీల్లో మొదటి స్థానం సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గజ్జేల నరేందర్,వ్యాయామ ఉపాధ్యాయులు ప్రతాప్ రెడ్డి తెలిపారు.అలాగే షాట్ పుట్ విభాగంలో రెండో స్థానం సాధించినట్లు తెలిపారు.ఇట్టి బహుమతులను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా అదనపు కలెక్టర్ బి. ఎస్. లత, జిల్లా విద్యాధికారి రాము, జిల్లా క్రీడల అధికారి రవికుమార్ చేతుల మీదుగా అందుకున్నట్లు వారు తెలిపారు. కాగా జిల్లా స్థాయి లో రాణించి పాఠశాల, గ్రామ కీర్తిని చాటిన విద్యార్థినిలను ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు గ్రామ ప్రజా ప్రతినిధులు, యువజన క్రీడాకారులు అభినందించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *