మిలియన్ మార్చ్ డే సందర్భంగా ఉద్యమకారుల ర్యాలీ

పయనించే సూర్యుడు మార్చి 13, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). ఖమ్మం జిల్లా: మార్చి 12, 2026 న మిలియన్ మార్చ్ డే సందర్భంగా తెలంగాణ యూనైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ (టి యు జేఏసీ) రాష్ట్ర అధ్యక్షులు ప్రపోల్ రామిరెడ్డి గారి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఖమ్మం జిల్లా అధ్యక్షులు మాదాసు శ్రీనివాస్ గారి పిలుపుమేరకు ఖమ్మం జిల్లా నుండి సుమారు వందమంది ఉద్యమకారులు హైదరాబాద్‌కు బయలుదేరారు.ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని చార్మినార్ వద్ద ప్రారంభమై గన్ పార్క్ వరకు ర్యాలీగా కొనసాగింది.ఉద్యమకారులు, కళాకారులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉద్యమ పాటలు, నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వీరులకు గౌరవంగా గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి పూలమాలలు అర్పించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ప్రపోల్ రామిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి చంద్రన్న ప్రసాద్, ఖమ్మం జిల్లా అధ్యక్షులు మాదాసు శ్రీనివాస్, రాష్ట్ర మహిళా కార్యకర్త డాక్టర్ పత్తిపాటి లక్ష్మీకాంతమ్మ, కాలంగి లలిత, నాగమణి తదితరులు పాల్గొన్నారు. అలాగే జిల్లా నాయకురాలు జి. నాగమణి, రాష్ట్ర నాయకులు మందటి కృష్ణ, తీగ రాములు తదితరులు పాల్గొని ఉద్యమకారుల హక్కుల సాధన కోసం తమ మద్దతును తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *