బియ్యం బస్తా అందజేత

పయనించే సూర్యుడు న్యూస్, మార్చి 13 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ):స్థానిక క్వారీపేట కాలనీలో ఇటీవల డోకు నూకరత్నం అనే నిరుపేద వృద్ధురాలు అనారోగ్యంతో మరణించింది. విషయం తెలుసుకుని వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు మైరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రి స్టాఫ్ నర్స్ నాగమణి ఆర్థిక సహాయంతో బియ్యం బస్తాను దిన కార్య నిమిత్తం వృద్ధురాలు ఆలనా పాలనా చూసుకునే కాకాడ సుబ్బలక్ష్మి కి గురువారం అందజేశారు.ఈ కార్యక్రమంలో వివేకానంద సేవా సమితి సభ్యులు పెండ్యాల రాజు,కాలనీవాసులు నాళం శ్రీను, పార సత్యనారాయణ, జుత్తుల శ్రీను,బత్తుల నాగేశ్వరరావు,పారా గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *