పయనించే సూర్యుడు మార్చి 13 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ పాలెం గ్రామంలో ఈరోజు ఎద్దులు మరియు బర్రెలకు గాలికుంటు వ్యాధి నివారణ కోసం టీకాలు వేయడం జరిగింది. పశువుల ఆరోగ్యం కాపాడేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బోనాసి రామకృష్ణ పాల్గొని రైతులకు పశువుల సంరక్షణపై అవగాహన కల్పించారు. అలాగే పశువైద్య సిబ్బంది అల్లస్వామి, రాము, శివ టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు సుదర్శన్ రెడ్డి, ఎం.డి. జాంగీర్, శంకర్, జంగయ్య తదితర రైతులు పాల్గొన్నారు. పశువులకు వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తగా టీకాలు వేయించుకోవాలని పశువైద్య సిబ్బంది రైతులకు సూచించారు.