బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధిగా వై. సునీల్ రావు నియామకం

పయనించే సూర్యుడు మార్చి 13 కరీంనగర్ న్యూస్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వై సునీల్ రావు ను నియమిస్తూ పార్టీ అధిష్టానం బుధవారం రాత్రి ఉత్తర్వులు వెలువర్చింది. ఈ మేరకు బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఆదేశాలు జారీ చేశారు. కరీంనగర్ మాజీ మేయర్ అయిన సునీల్ రావు ఇటీవల కరీంనగర్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు రా మచంద్ర రావు తో పాటు తనకు అన్నివేళలా అండదండలు అందిస్తున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో పార్టీ అభ్యున్నతికి తనదైన శైలిలో కృషి చేస్తూనే నాయకులను కార్యకర్తలు కలుపుకొని ముందుకు సాగుతాననే విశ్వాసాన్ని సునీల్ రావు వ్యక్తం చేశారు కేంద్రంలో మోదీ సర్కార్ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత తీసుకెళ్తూనే తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన తనదైన పోరాటాన్ని కొనసాగిస్తానని బిజెపి జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గం కన్వీనర్ ప్రవీణ్ రావు ఇతర నాయకులందరి సహకారంతో పార్టీలో ఒక సైనికుడిగా పని చేస్తానని సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *