అత్యవసర సమయంలో రక్తదానం చేసి ప్రాణం నిలిపిన హనుమాన్ దీక్ష స్వామి

పయనించే సూర్యుడు న్యూస్ సమీయొద్దీన్ మెట్ పల్లి మార్చ్ 13 మెట్ పల్లి పట్టణంలో మానవత్వానికి నిలువెత్తు ఉదాహరణగా ఒక యువకుడు అత్యవసర సమయంలో రక్తదానం చేసి ప్రాణాన్ని కాపాడారు. మెట్ పల్లి పట్టణంలోని తిరుమల నర్సింగ్ హోమ్ లో చికిత్స పొందుతున్న లక్ష్మీ అనే మహిళకు అత్యవసర చికిత్స కోసం ‘ఏ’ పాజిటివ్ రక్తం అవసరమైంది. దీంతో పేషెంట్ కుటుంబ సభ్యులు రక్తదాత కోసం వెతుకుతూ రక్తదాతల అనుసంధాన కర్త ఉదయ్ కుమార్ ను సంప్రదించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆక్టివ్ బ్లడ్ డోనర్ కర్నాల గౌతమ్ స్వామికి సమాచారం అందించగా, ఆయన వెంటనే స్పందించి బ్లడ్ బ్యాంక్‌కు చేరుకుని రక్తదానం చేశారు. తీవ్రమైన ఎండలో హనుమాన్ దీక్షలో ఉండి కూడా అత్యవసరం అని తెలుసుకున్న వెంటనే స్పందించి రక్తదానం చేయడం అందరినీ అభినందించేటట్లు చేసింది. ఈ సందర్భంగా బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, రక్తదాతల అనుసంధాన కర్త ఉదయ్ కుమార్, యువజన సంఘాల సభ్యులు, పేషెంట్ బంధువులు, స్నేహితులు కర్నాల గౌతమ్ సేవాభావాన్ని ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు. అత్యవసర సమయంలో రక్తదానం చేసి ఒక ప్రాణాన్ని కాపాడిన గౌతమ్ సేవా స్పూర్తి యువతకు ఆదర్శంగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *