కార్మిక వ్యతిరేక లేబర్ కోడుల రద్దుకై జరిగే మహాధర్నాను జయప్రదం చేయండి

ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ.వెంకన్న

పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి, సెంటినరీ కాలనీ -13 కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడుల ను రద్దు కై మార్చి 16న జరిగే మహా ధర్నా జయప్రదం చేయాలని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ వెంకన్న అన్నారు.భూపాలపల్లి డివిజన్ లో మార్చి 16న జరిగే మహా ధర్నా పోస్టర్ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా.. ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ వెంకన్న మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానములో తెచ్చిన నాలుగు లేబర్ కోడులను ఏప్రిల్-1 నుండి అమలు చేయాలని గెజిట్ విడుదల చేసిందని ఈ నాలుగు లేబర్ కోడులకు వ్యతిరేకంగా జరిగిన దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మికుల పాల్గొని తీవ్ర నిరసనను, వ్యతిరేకతను తెలిపారని లేబర్ కోడులు కార్మికులకు ఎంతో నష్టకరమైన వని నాలుగు లేబర్ కోడుల పై కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో సమగ్ర చర్చలు జరుపకుండా కార్మిక సంఘాలతో చర్చించకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా అమలు చేయాలని చెప్పడం కార్పొరేట్లను సంతృప్తి పరచడానికే అని అన్నారు.దేశంలో కార్మిక వర్గాన్ని పెట్టుబడి దారులకు కట్టు బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడలను సింగరేణిలో అమలు చేయవద్దని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలని యాజమాన్యాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో ఎం రామ్ రెడ్డి, జె కుమారస్వామి, మేకల సతీష్, సుంకర సతీష్, జోర్ నరేష్, ధరావత్ రఘు, మేకల ఉపేందర్, పబ్బ కుమారస్వామి, మేకల రమేష్, భోగి రాజేందర్, బౌత్ కమలాకర్, జిమ్ముడా రవి, బొడ్డు దేవేందర్, వెంగళ సునీల్, జిమ్ముడ నాంపల్లి. తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *