14/03/2026 శనివారం పుంగనూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆవిర్భావ0 దినోత్సవం వేడుకలు

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మార్చి13.03.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ 0 ప్రతినిధి జె. నాగరాజ) కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ సూచనల మేరకు మండలాల వారిగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది క్రింద తెలిపిన సమయాలను అనుసరించుకొని కార్యక్రమం వివరములు.. ఉదయం 8 గంటలకు బాలాజీ థియేటర్ పక్కన వెలసిన శ్రీ ఓం శక్తి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం. ఉదయం 9 గంటలకు పుంగనూరు పార్టీ కార్యాలయం వద్ద మిఠాయి పంపిణీ కార్యక్రమం. ఉదయం 10 గంటలకు పుంగనూరు సర్కిల్ నందు అన్నదాన కార్యక్రమం. ఉదయం 11 గంటలకు చౌడేపల్లి నందు జండా ఆవిష్కరణ కేక్ కటింగ్ కార్యక్రమం. మధ్యానం 12 గంటలకు సోమల నందు జండా ఆవిష్కరణ మరియు అన్నదాన కార్యక్రమం. మధ్యానం 2 గంటలకు సదుం బస్టాండ్ కూడలి నందు జండా ఆవిష్కరణ కార్యక్రమం. మధ్యానం 3 గంటలకు కల్లూరు జంక్షన్ నందు జెండా ఆవిష్కరణ కార్యక్రమ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ హాజరవుతారు సాయంత్రం 5 గంటలకు రొంపిచర్ల బస్టాండ్ కూడలి నందు జండా ఆవిష్కరణ కార్యక్రమం కలదు. పైన నిర్ణయించిన సమయానికి అనుకూలంగా నియోజకవర్గ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కావున మండల అధ్యక్షులు మరియు మండల కార్యవర్గం నియోజకవర్గ జనసేన పార్టీ కుటుంబ సభ్యులు వీర మహిళలు తప్పక హాజరవుతారని కోరుకుంటూ… జనసేన పార్టీ కార్యాలయం పుంగనూరు నియోజకవర్గం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *