ఆలమూరు ఆగమ పండితుడికి ఆలమూరు వాసవి క్లబ్ వారు అభినందన పూర్వక చిరు సత్కారం…

పయనించే సూర్యుడు మార్చి 13 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు టీటీడీ వేద విజ్ఞాన పీఠం ధర్మగిరి ద్వారా 1969 లో ప్రారంభించిన వేద శాస్త్ర ఆగమ విద్వత్ సదస్సు పరిపాలనా కారణాల రీత్యా ఇప్పటికీ 29 సదస్సులు జరిగాయి ఈ సదస్సులో ఉన్న ప్రధాన ఆంతర్యం అన్ని ఆగమ శాస్త్రాల మీద మరియు వేదాల మీద లేఖనా మరియు మౌఖిక పరీక్షలు ఆరు రోజులు నిర్వహించి ఆయా పరీక్షలలో ఉత్తీర్ణులైన వారిని అప్పటినుండి వారి జీవితకాలము వారిని వార్షిక సత్కార పండితులుగా గుర్తించడం అలా గుర్తించి శ్రీనివాసుడి ఆశీస్సులతో వేద విజ్ఞాన పీఠం ద్వారా ఈ విద్వత్ సదస్సు పెట్టినప్పుడల్లా వారికి వార్షిక సత్కార ఆహ్వానాన్ని పంపి వారందరికీ చిరు సత్కారం చేయడం తద్వారా వేద విజ్ఞానాన్ని హైందవ భక్తులందరికీ అందజేయడం. ఈ కోవలో 2006లో శైవాగమ శాస్త్ర విభాగంలో ఆరు రోజులు ఈ సదస్సుకి ( 24 వ సదస్సు ) సంబంధించిన పరీక్షలలో పాల్గొని ఉత్తీర్ణుడై ఆ నాటినుండి ఆలమూరికి సంబంధించిన శైవాగమశాస్త్ర పండితుడైన ప్రతిష్టాచార్య ఉపన్యాస వాచస్పతి అయిన దక్షిణ భారతదేశంలోనే ఏకైక ఆలయం అయిన శ్రీ భట్టి విక్రమార్క ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ కాళ్ళకూరి సూరిపండు ( సూర్యశ్రీ ) శివాచార్య వారిని ఆలమూరు కి చెందిన వైశ్య భక్తులు శ్రీ వాసవీక్లబ్ సభ్యులందరూ మా గ్రామానికి చెందిన ఆలయఅర్చకులు ఈ అరుదైన గౌరవ సత్కారాన్ని ఆరోసారి టిటిడి ద్వారా అందుకోవడం మా ఆలమూరుకే గర్వకారణం అని ఈ దంపతులను అభినందించి చిరు సత్కారం జరిపి వారి ఆశీస్సులు అందుకున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *