జిల్లా విద్యాశాఖ అధికారిని కలిసిన జిల్లా డి.వి.ఎంసీ మెంబర్ వెంట్రు సుధీర్.

పయ నించే న్యూస్ మార్చి 13 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా విద్యాశాఖ అధికారి వారి కార్యాలయంలో డిస్ట్రిక్ట్ స్కూల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పి. నాగేశ్వరరావు వారిని మరియు ఏ సి ఓ ఎడిషనల్ కో.ఆర్డినేటర్ సమగ్రశిక్ష మమ్మీ వారిని మర్యాద పూర్వకముగా కలిసిన డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్సి,ఎస్టీ విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ సభ్యులు వెంట్రు సుధీర్. ఈ నెల 16 వ తేదీన నుండి ప్రారంభం కానున్న పదోవ తరగతి పరీక్ష కేంద్రాలు వద్ద విద్యార్థులుకు ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు వ్రాయుటకు అవసరమైన వసతులు, పరీక్ష కేంద్రాలు వద్ద ఏర్పాటుచేసిన బందోబస్తు మొదలగు అంశాలును చర్చించి మరియు విద్యార్థులకు అవసరమైన వసతులు కల్పించి ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు నిర్వహించి విద్యార్థులకు ఎటువంటి లోటు పాట్లు లేకుండా తగు ఏర్పాట్లు చేయాలనీ జిల్లా విద్యాశాఖ అధికారులను కోరిన డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్సి,ఎస్టీ విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ సభ్యులు వెంట్రు సుధీర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *