తిరుమల వేద సదస్సులో తెల్కపల్లి అర్చకుడికి గౌరవం.

తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించిన వేద శాస్త్రాగమ సదస్సు.

పయనించే సూర్యుడు. మార్చి 15. నాగర్ కర్నూల్ జిల్లా. తెల్కపల్లి మండలం రిపోర్టర్ :సుల్తాన్. తిరుమల తిరుపతి దేవస్థానం వారు, తిరుపతి ధర్మగిరి వేద పాఠశాల నందు నిర్వహించిన 29వ వేద శాస్త్రాగమ విద్వత్ సదస్సులో , నాగర్ కర్నూల్ జిల్లా, తెల్కపల్లి మండలంలో ఉన్న శివాలయంలో అర్చకుడు సాయి ఈశ్వర శర్మ s/o మహానంది శర్మ , శైవాగమ విభాగమ పరీక్షల్లోప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై,విజయ పత్రమును ,శృంగేరి పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతీ తీర్థ మహా స్వామివార్ల కరకమలములచే విజయ పత్రమును పొందినారు, ఈ సందర్భంగా మన ప్రాంతానికి చెందిన సాయి ఈశ్వర్ శర్మకు ఇలాంటి పురస్కారం లభించడం గర్వకారణం అని పలువురు గ్రామ పెద్దలు, నాయకులు ఆయనను ప్రశంసించి హర్షం వ్యక్తం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *