గ్రామాల్లో ఘనంగా జనసేన 13 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రేఖా గౌడ్

* గ్రామాల్లో జనసేన జెండా ఆవిష్కరణ * అధినేత పిలుపును అందుకొన్న జనశ్రేణులు * కష్టాన్ని పలకరించి పరిష్కారం చూపే గొప్ప నాయకుడు సేనాని గానిగ బాషా సోషల్ మీడియా ఇంచార్జ్

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 15, 2026: గోనెగండ్ల రిపోర్టర్ సురేష్ జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదల పవన్ కళ్యాణ్ పిలుపును అందుకొన్న, గొనెగండ్ల మండల జనసేన నాయకులు కార్యకర్తలు, ఎమ్మిగనూరు నియోజక వర్గ ఇంచార్జీ రేఖ గౌడ్ ఆధ్వర్యంలో గొనెగండ్ల మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో కార్యకర్తలు 13 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను వారి గ్రామాల్లో ఘనంగా జరుపుకున్నారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఇంచార్జీ రేఖగౌడ్ శనివారం రోజు మీడియాతో మాట్లాడుతూ, గొనెగండ్ల మండల కేంద్రంతో పాటు పుట్టపాశం, హెచ్, కైరవాడి, గాజులదిన్నె గ్రామాల్లో జనసేన పార్టీ 13 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. 2014 లో ఎన్నో ఆశయాలతో పార్టీని స్థాపించి ఎన్నో ఒడిదుడు కులను ఎదుర్కొని, సామాన్య యువత సైతం పార్టీలో క్రమశిక్షణగా పనిచేసేలా ప్రోత్సహిస్తూ యువతను సేవా మార్గంలో నడిపిస్తూ 2024 లో ఉప ముఖ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఎంచుకున్న శాఖలను బాధ్యతాయుతంగా ముందుకు నడిపిస్తూ ప్రజా నాయకుడిగా రాష్ట్ర ప్రజల మన్ననలు పొందుతున్నారని. ప్రజలు కష్టంతో ఎదురొస్తే కష్టాన్ని పలకరించి పరిష్కరించే నాయకుని అడుగు జాడల్లో నడిచే ప్రతి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఆశయాల కోసమే పని చేస్తారన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీని నమ్ముకొని కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు రాబోయే రోజుల్లో కాబోయే నాయకునిగా గుర్తింపు ఇవ్వడానికి పార్టీ సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్య క్రమంలో జనసేన పార్టీ నియోజక వర్గ మీడియా ఇంచార్జీ గానిగ బాషా, మండల నాయకులు,ఖాసిం సాహెబ్, మాలిక్, సుభాన్,ఉత్తేజ్, వినోద్,సత్య, జాని,అనిల్ కుమార్, పెద్దయ్య,పవన్, మహమ్మద్ హుస్సేన్,మాబాషా, గౌండ ఖాసిం,పుట్ట పాశం గ్రామ నాయకులు, రామంజీ నేయులు,భాస్కర్, హనుమంతు, శ్రీరామ్, హెచ్ కైరవాడి గ్రామ నాయకులు దూద్ పిరా, ఇస్మాయిల్, ఖలీల్, గాజులదిన్నె జనసేన నాయకులు వడ్ల నాగేష్, చంద్ర శేఖర్, ల ఆధ్వర్యంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *