అగసలదిన్నె గ్రామాలలో ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం.

మంత్రాలయం జనసేన పార్టీ ఇంచార్జ్ వాల్మీకి బి లక్ష్మన్న. రాష్ట్ర ఐక్య వాల్మీకి బోయ పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షులు వాల్మీకి బి లక్ష్మన్న.

పయనించే సూర్యుడు మార్చి 15 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలం తోవి, ఆసలదిన్నె గ్రామాలలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు అంగరంగ వైభవంగా ఘనంగా జరుపుకున్నారు. ముందుగా తోవి గ్రామంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవమునకు మంత్రాలయం జనసేన పోటీ ఇన్చార్జి, రాష్ట్ర ఐక్య వాల్మీకి బోయ పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షులు వాల్మీకి బి లక్ష్మన్న ముఖ్య అతిథిగా హాజరైనారు. తోవి గ్రామంలో కౌతాళం మండల జనసేన పార్టీ అధ్యక్షుడు పి సుమిత్ర మరియు జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జరిగింది. తదనంతరం కౌతాళం మండలం ఆగసల దీన్నే గ్రామంలో జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడు నాగరాజు మరియు గ్రామ జనసేన పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. పై రెండు గ్రామాల కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా మంత్రాలయం జనసేన పార్టీ ఇంచార్జ్, ఐక్య వాల్మీకి బోయ పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షులు వాల్మీకి బి లక్ష్మన్న హాజరై ప్రసంగించారు. వాల్మీకి బి లక్ష్మన్న జనసేన పార్టీ నాయకులను కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కే పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ రోజు రోజుకు బలో పేతం అవుతుందని తెలిపారు. పక్క రాష్ట్రాలలో కూడా కే పవన్ కళ్యాణ్ ని లక్షల సంఖ్యలో బలపరుస్తున్నారని రాష్ట్రంలో జనసేన పార్టీ ఒక తిరుగులేని శక్తిగా తయారవుతుందని వాల్మీకి బీ లక్ష్మణ జోష్యం చెప్పారు. ఈ కార్యక్రమాలకు కౌతాళం మండల జనసేన పార్టీ అధ్యక్షులు పి సుమిత్ర, పెద్దకడూరు మండల జనసేన పార్టీ అధ్యక్షులు జి.బజార్ అప్ప, కోసిగి మండల జనసేన పార్టీ అధ్యక్షులు సి.వీర రెడ్డి, మంత్రాలయం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు బివి రవిచంద్ర, కౌతాళం మండల జనసేన పార్టీ నాయకులు ఎస్ చిన్న, ఈరన్న, యేసు, నాగేషు, నాగరాజు, తిక్కయ్య, ఈరప్ప, పెద్దకడూరు మండలం సుభాను, ప్రభుదాసు, హుసేని,అగసల దీన్నే గ్రామ అధ్యక్షులు నాగరాజు, ఎల్లప్ప, రామ, బీరప్ప, ఇరుపాది, సంజీవ, గంగప్ప, ప్రకాష్, మరియు ముఖ్య నాయకులు శంకర్,సోమప్ప, గణేష్, రామయ్య, ఉరుకుందు నాయకులు మొదలగు నాయకులు పెద్ద సంఖ్యలో జనసేన కార్యకర్తలు పాల్గొని జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను విజయ వంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *