ఆరోగ్యకరమైన సమాజానికి పునాదులు వేద్దాం.

*హెచ్ పీ వి . వాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన పలాస నియోజకవర్గ శాసన సభ్యులు గౌతు శిరీష.

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 15 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్..పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని కాశీబుగ్గ హై స్కూల్ లో పలాస ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన హెచ్ పి వి వాక్సినేషన్ కార్యక్రమాన్ని పలాస నియోజకవర్గ శాసన సభ్యులు గౌతు శిరీష శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భాశయ ముఖద్వార ప్రాథమిక దశలోనే అరికట్టడానికి ఈ వ్యాక్సినేషన్ ఎంతో కీలకమని, 14 నుంచి 16 సంవత్సరాల వయసు గల ఆడపిల్లలకు గర్భాశయ క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు రాకుండా ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా ఉచితంగా అందిస్తున్నారని తెలిపారు చిన్న వయసులోని ఈ వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల భవిష్యత్తులో వచ్చే గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించవచ్చని పేర్కొన్నారు ఆడపిల్లల ఆరోగ్యం కుటుంబానికి, సమాజానికి ఎంతో ముఖ్యమని అన్నారు.ప్రభుత్వం చేపట్టిన ఈ ఉచిత వ్యాక్సిన్ కార్యక్రమం ద్వారా బాలికలు ఆరోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు.ప్రతి అర్హత గల బాలికకు ఈ ఉచిత వ్యాక్సినేషన్ అందేలా తల్లిదండ్రులు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *