పయనించే సూర్యుడు మార్చి 15 ఉట్నూర్ మండలం రిపోర్టర్ షైక్ సోహెల్ పాషా ఉట్నూర్: ఉట్నూర్ మండలం దంతన్‌పల్లి గ్రామంలో శనివారం ఎఫ్‌ఎమ్‌డీ (గాలికుంట) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామంలోని పశువులకు గాలికుంట టీకాలు వేశారు పశువులకు అంటువ్యాధులు సోకకుండా రైతులకు ఆర్థిక నష్టం కలగకుండా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని అధికారులు తెలిపారు గాలికుంట వ్యాధి సోకితే పశువుల్లో పాల ఉత్పత్తి తగ్గడంతో పాటు బలహీనత మరణాల ప్రమాదం ఉంటుందని వివరించారు అందువల్ల ప్రతి పశు యజమాని తమ పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని సూచించారు గ్రామంలో ఇంటింటికీ వెళ్లి పశువులను గుర్తించి టీకాలు వేసినట్లు తెలిపారు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఈ సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో వీఎల్వో లాల్ దేవ్, వీఏ నాగోరావ్, ఓఎస్‌లు పాల్గొన్నారు.