తిమ్మాపురంలో ఘనంగా జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం..జెండాను ఆవిష్కరించిన మాదారపు తాతాజీ..

పయనించే సూర్యుడు మార్చి 15, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తిమ్మాపురం గ్రామ గౌరవ జనసేన పార్టీ అధ్యక్షులు మాదారపు తాతాజీ పిలుపునిచ్చారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామం లో జనసేన పార్టీ కార్యాలయం వద్ద పార్టీ జెండాలో ఆయన ఆవిష్కరించి జనసేన పార్టీ నాయకులకు జనసేనకులకు వీర మహిళలకు స్వీట్లు తినిపించారు. కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో జనసేన పార్టీ బలోపేతంగా ఉందని కాకినాడ రూరల్ నియోజకవర్గం లో ఎమ్మెల్యే పంతం నానాజీ అభివృద్ధిలో దూసుకుపోతున్నారని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామాలే పట్టుకొమ్మలుగా అభివృద్ధి చేయంగా ముందుకు వెళ్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు వీర మహిళలు జనసైనికులు గ్రామస్తులు తాతాజీ యూత్ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *