పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి మార్చ్ 15 మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మెట్టుపల్లి ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని 300 మంది ఆయాల వేతనాలు జూలై 2024 . ఒక నెల వేతనం వారి బ్యాంక్ అకౌంట్లో వేయకుండా నిర్లక్ష్యం చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఆయాల వేతనాలు ఇవ్వాలని ఎందుకు నిలిపివేశారు అని అనేకసార్లు సిడిపిఓ , డిడబ్ల్యుఓను అడిగినా కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ కావాలనే ఆయాల వేతనాలు ఆపడం ఎంతవరకు సమంజసం అని దీనిపైన పూర్తి విచారణ చేయాలని దీనికి బాధ్యులైన అధికారుల పైన శాఖ పరమైన చర్యలు తీసుకోనీ భవిష్యత్తులో ఇలాంటివి పునరావతం జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఈ బడ్జెట్ లో ఆయాల వేతనాలు ఇప్పించే విధంగా చర్యలు తీసుకొని ఆయాల వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం