ఘనంగా పెద్దకడుబురులో జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 16 రిపోర్టర్ అభి పెద్దకడుబురు మండల కేంద్రంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో పార్టీ జెండాను నాయకులు ఆవిష్కరించి వేడుకలు జరిపారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు జీలకర గణేష్, రామాంజనేయులు, యేసుబు మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ బలాన్ని చాటుకునేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని అన్నారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రజా సమస్యల పరిష్కారానికి జనసేన కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసి ప్రతి ప్రాంతంలో జనసేన జెండా ఎగురవేయాలని నాయకులు కార్యకర్తలకు సూచించారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి యువతను, ప్రజలను జనసేన వైపు ఆకర్షించేలా పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *