కల్వచర్లలో పోచమ్మ గుడికి భక్తుల సందడి

* ఉగాది ముందు అమ్మవార్లకు మొక్కుబడి చెల్లింపు

పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి, సెంటినరీకాలనీ -16 రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలోని పోచమ్మ గుడి ఆవరణలోని మదనపు పోచమ్మ, బంగారు పోచమ్మ, మంకాలమ్మ లతోపాటు, దుర్గమ్మ-పెద్దదేవర దేవతల గుడికి భక్తులు తమ కుటుంబంతో వచ్చి భారీగా మొక్కులు చెల్లించారు.ప్రతి ఏడూ ఉగాది ముందు అమ్మవార్లకు ఆనవాయితీగా ప్రతి ఇంట బోనం వండి అమ్మవార్లకు నైవేద్యంగా అర్పిస్తారు. నైవేద్యంతోపాటు పసుపు, కుంకుమ, బెల్లం, చక్కర, పప్పులతో పాటు ఉల్లిగడ్డ, కోడిగుడ్డు, నిమ్మకాయలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించి, తమ మొక్కుబడి ప్రకారంగా కోళ్లు, మేకలను కోసి తమ కుటుంబసభ్యులు పిల్లాపాపలు, పాడి పంటలతో చల్లగా చూడాలని అమ్మవార్లను వేడుకున్నారు. తమ పిల్లల విద్యాభ్యాసం పరీక్షల సమయం కావడంతో అన్ని పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని, మంచి ర్యాంకులు సాధించాలని ప్రత్యేక పూజలతో అమ్మవార్లను కొలుస్తూ, ఉగాది ముందు చివరి ఆదివారం సెలవుదినం కావడంతో కల్వచర్ల గ్రామస్తులే కాకుండా సింగరేణి సెంటినరీకాలనీ ప్రాంతం నుండి సందడిగా భారీగా భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *