కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడుల ను రద్దు కై మార్చి 16 న జరిగే మహా ధర్నా జయప్రదం చేయండి.

పయనించే సూర్యుడు న్యూస్ : పెద్దపల్లి, సెంటినరీ కాలనీ -16 సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో రామగుండం – -3 డివిజన్ లో మార్చి 16న జరిగే మహా ధర్నా పోస్టర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ వెంకన్న మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దుచేసి స్థానములో తెచ్చిన నాలుగు లేబర్ కోడులను ఏప్రిల్.1 నుండి అమలు చేయాలని గెజిట్ విడుదల చేసిందని ఈ నాలుగు లేబర్ కోడులకు వ్యతిరేకంగా జరిగిన దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మికుల పాల్గొని తీవ్ర నిరసనను, వ్యతిరేకతను తెలిపారని లేబర్ కోడులు కార్మికులకు ఎంతో నష్టకరమైన వని నాలుగు లేబర్ కోడుల పై కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో సమగ్ర చర్చలు జరుపకుండా కార్మిక సంఘాలతో చర్చించకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా అమలు చేయాలని చెప్పడం కార్పొరేట్లను సంతృప్తి పరచడానికే అని అన్నారు. దేశంలో కార్మిక వర్గాన్ని పెట్టుబడి దారులకు కట్టు బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడలను సింగరేణిలో అమలు చేయవద్దని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలని యాజమాన్యాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో జీ నర్సయ్య, జీ లింగయ్య, సంపత్, శ్రీనివాస్, రమేష్, సరి,సదానందం, రాజయ్య,ఓదెలు,ఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *