పయనించే సూర్యుడు మార్చ్ 16 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్ట్ కృష్ణ ఆదోనిలో ఎన్డీఏ కూటమిని విడగొట్టాలని వైఎస్ఆర్సిపి కుట్ర పన్నిందని ఎమ్మెల్యే పార్థసారథి ఆరోపించారు. సాయికుమార్ అనే జనసేన కార్యకర్త సోషల్ మీడియాలో మాట్లాడిన మాటలకు గంట వ్యవధి లోనే రెస్పాండ్ అయ్యి సాయికుమార్ అనే జనసేన కార్యకర్త దగ్గరికే ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వెళ్లి జనసేన నాయకుల కష్టనష్టాలు తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి మీడియా ముందు మాట్లాడుతూ జనసేన పార్టీ కార్యకర్తలకు ఎటువంటి లోటు కలగకుండా చూసుకుంటానని, అసంతృప్తి ఉన్న కార్యకర్తలను ఒక్కొక్కరిని కలుస్తానని, జనసేన పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఇటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ఇంకా 25 సంవత్సరాల పాటు కొనసాగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారని,
కూటమిని విడగొట్టాలని చూస్తున్న వైఎస్సార్సీపి కుట్రను కూటమి కార్యకర్తలు తిప్పి కొడతామని ఎమ్మెల్యే పార్థసారథి తెలిపారు. ఆదోనిలో కూటమి కలిసున్నన్నంతకాలం మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే కాలేడని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.