విద్యా కమిషన్ సూచించిన ఆమోదయోగ్యమైన సిఫారసులు వెంటనే అమలు చేయాలి

ధర్మ టీచర్స్ యూనిటీ నల్గొండ జిల్లా కో కన్వీనర్ నగేష్ మహారాజ్

పయనించే సూర్యుడు మార్చ్ 16 ( ప్రతినిధి గుమ్మకొండ సుధాకర్ డిండి మండలం నల్లగొండ జిల్లా) ధర్మ టీచర్స్ యూనిటీ ఆధ్వర్యంలో ఇటీవల తెలంగాణ విద్యా కమిషన్ సమర్పించిన విద్యా విధాన పత్రం 2026 పై స్పందించారు. ఈ సందర్భంగా ధర్మ టీచర్స్ యూనిటీ జిల్లా కో కన్వీనర్ నగేష్ మహారాజ్ మాట్లాడుతూ విద్యా కమిషన్ సూచించిన చాలా సిఫారసులు ఆమోదయోగ్యంగా ఉన్నవి. అందులో ముఖ్యంగా విద్యకి బడ్జెట్లో 18 శాతం కేటాయించాలని, అదేవిధంగా నాణ్యమైన విద్యతో కూడిన తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ స్థాపించాలని, దూర ప్రాంత విద్యార్థులకు రవాణా సౌకర్యం ఉచితంగా కల్పించడం, ప్రభుత్వ పాఠశాలలకు తగినంత సిబ్బందిని కేటాయించడం, స్పోకెన్ ఇంగ్లీష్ కు సంబంధించిన ఉపాధ్యాయులని నియమించడం, డీజిటల్ విద్య సౌకర్యం, మౌలిక వసతులు కల్పించడం, కంప్యూటర్ విద్య, గ్రంథాలయం ఏర్పాటు చేయాలని సూచించడం, ఉదయం పూట విద్యార్థులకు అల్పాహారం అందించడం, మధ్యాహ్నం మంచి మెనుతో కూడిన మధ్యాహ్న భోజనం అందించడం, సాయంత్రం స్నాక్స్ అందించాలని నిర్ణయించడం, ఆరోగ్యం సంబంధించిన నర్సులను కేటాయించడం, మధ్యాహ్న భోజనానికి సంబంధించిన పనులు ఎస్టేట్ మేనేజర్ ను కేటాయించడం, సెక్యూరిటీ గార్డులను నియమించడం, పాఠశాలకు కావాల్సిన బోధనేతర సిబ్బందిని కేటాయించడం ధర్మ టీచర్స్ యూనియన్ స్వాగతిస్తుంది. అదేవిధంగా విద్యార్థులు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసి వెనువెంటనే ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాయడం విద్యార్థులకు ఒత్తిడికి లోనవుతారని భావించి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రద్దు చేయడంపై సమంజసమే అని ధర్మ టీచర్స్ యూనిటీ భావిస్తుంది. కార్యక్రమంలో ధర్మ టీచర్స్ యూనిటీ జిల్లా కన్వీనర్ బి నాగయ్య డిండి మండల డిటియు కన్వీనర్ కాట్రావత్ మల్లేష్ రాథోడ్, డిటియు కో కన్వీనర్ సిహెచ్ బిచ్చయ్య పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *