మార్చి 16న బిల్డింగ్ వర్కర్ యూనియర్ జిల్లా ధర్నాను జయప్రదం చేయాలని వత్సవాయి గాంధీ పార్క్ సెంటర్ లో కరపత్రం విడుదల

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మార్చి 16 వత్సవాయి గ్రామంలోని ఈరోజు న మార్చి 16న బిల్డింగ్ వర్కర్ యూనియర్ జిల్లా ధర్నాను జయప్రదం చేయాలని వత్సవాయి గాంధీ పార్క్ సెంటర్ లో కరపత్రం విడుదల ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి బి.రాము మాట్లాడుతూ… నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పనిచేయించి. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తిత్తి ప్రకటన చేయకుండా గతంలో సంక్షేమ పథకాలు అమలు చేయాలని మార్చి 16న రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లు వద్ద జరిగే ధర్నాని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులందరూ పని బంద్ చేసి పాల్గొనాలని పిలుపునిచ్చారు తక్షణమే మెమో 12 14 రద్దుచేసి బిల్డింగ్ వర్కర్స్ కి వెల్ఫేర్ బోర్డ్ పని చేయించి సంక్షేమ పథకాలు పునరుద్ధరించాలి. 2020 సెప్టెంబర్ 7వ తేదీ నాటికి పెండింగ్లో ఉన్న వారికి,ఆ తర్వాత దరఖాస్తు చేసుకున్న అర్హులైన భవన నిర్మాణ కార్మికులకి క్లెయిమ్స్ చెల్లించాలి. పోరుగు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పిల్లలకు స్కాలర్ షిప్ లు,గృహ నిర్మాణాలకు లోన్లు పూర్తి ఉచిత వైద్య సహాయం, పెన్షన్,వంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలి. సంక్షేమ బోర్డు ద్వారా గతంలో అమలు చేసిన అన్ని పథకాలు అమలు చేయాలి. ప్రమాదం శాతు మరణిస్తే ఆర్దిక సాయం రూ.10 లక్షలు పెంచాలి. ఈ కార్యక్రమంలో జాన్, వీరస్వామి, వెంకటనారాయణ, గురవయ్య, ముజఫర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *