పయనించే సూర్యుడు మార్చి 16 ఉట్నూర్ మండలం రిపోర్టర్ షైక్ సోహెల్ పాషా ఉట్నూర్: రైతులకు వెన్నుదన్నుగా నిలిచే రైతుబంధు నిధులను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భరత్ చౌహన్ కోరారు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం కొత్తగూడ గ్రామంలో రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రస్తుతం సాగు పనులు ప్రారంభమైన నేపథ్యంలో విత్తనాలు ఎరువులు పురుగుమందుల కొనుగోలుకు రైతులకు నిధులు అత్యవసరమని పేర్కొన్నారు రైతుబంధు నిధుల విడుదలలో జాప్యం కారణంగా రైతులు అప్పుల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్లో ఉన్న మొత్తాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు గ్రామంలో వ్యవసాయానికి సంబంధించిన సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు ముఖ్యంగా పొలాల్లో అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్ తీగలను సరిచేయాలని సంబంధిత అధికారులను కోరారు విద్యుత్ అంతరాయాల వల్ల బోర్లు మోటార్లు సక్రమంగా పనిచేయక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు పంటల బీమా అమలులో లోపాలు ఉన్నాయని నష్టపరిహారం సకాలంలో అందడం లేదని రైతులు విన్నవించినట్లు తెలిపారు రైతుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ సమావేశంలో గ్రామ పెద్దలు బండు శంబు బాదు తదితరులు పాల్గొన్నారు.