
పయనించే సూర్యుడు మార్చి 16 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన కాట్రేనికోన మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా పిఎస్ నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం కాట్రేనికోనలో ఒక ప్రైవేటు భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రెస్ క్లబ్ కమిటీని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా జగడ శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులుగా రంబాల శ్రీమహావిష్ణువు, మట్టపర్తి రవీంద్రనాథ్, కోశాధికారిగా గ్రంధి సూర్యనారాయణ గుప్తా ( నానాజీ),ఉపాధ్యక్షులుగా కొంకి రవి,గోనె మడతల బ్రహ్మాజీ, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా మల్లాడి మహావిష్ణువు బైరవ, మట్టపర్తి శ్రీహరి రావు, సహాయక కార్యదర్శిగా అయితా బత్తుల శ్రీనివాసరావు లు ఎన్నికయ్యారు . కాట్రేనికోన మండలంలో మొట్టమొదటిసారిగా ఏర్పడిన ప్రెస్ క్లబ్ కు సంబంధించి స్థల సేకరణ, భవన నిర్మాణాల కోసం ప్రజా ప్రతినిధులు అధికారులు, సభ్యుల సహకారంతో కృషి చేస్తానని ఈ సందర్భంగా నాయుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాశి చక్రి, బడుగు శ్రీనివాసరావు, కే సురేష్ కుమార్, ఎన్ రాంబాబు,నేలపాటి నాని బాబు,అయితే బత్తుల పండు బాబు,దార్ల రవి,తాడి శ్రీనివాస్, కముజు సుందరయ్య, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.