పయనించే సూర్యుడు మార్చి 17 ఆదోని రూరల్ రిపోర్టర్ అమరజీవి పొట్టి శ్రీరాములు 125 వ జయంతిని పురస్కరించుకొని సోమవారం ఆదోని పట్టణంలోని మున్సిపల్ మెయిన్ రోడ్డు వద్ద ఉన్న ఆయన విగ్రహానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాన్వి దేవేంద్రప్ప మాట్లాడుతూ.. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. ఆయన చేసిన ఆత్మబలిదానం తెలుగు జాతి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. అలాగే అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో స్థిర స్థాయిగా ఉండాలని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అమరావతి రాజధాని లో విగ్రహాన్ని స్థాపించినారు ఇది తెలుగు రాష్ట్రానికి గర్వకరణం అని తెలిపినారు.