రైతన్న మీ కోసం కార్యక్రమంతో అన్నదాతలకు అండగా నిలుస్తాం: ఎమ్మెల్యే గౌతు శిరీష.

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 17 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్ . రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “రైతన్న మీ కోసం” కార్యక్రమం ద్వారా వ్యవసాయాన్ని పండుగలా మార్చి, ప్రతి రైతు కుటుంబానికి అండగా నిలవడమే తమ ప్రభుత్వ ధ్యేయమని పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. పలాస నియోజకవర్గం వజ్రపుకొత్తూరు మండలం నగరంపల్లి గ్రామంలో జరిగిన “రైతన్న మీ కోసం” కార్యక్రమంలో సోమవారం ఆమె పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతుల సంక్షేమం కోసం ‘పంచసూత్రాల’ ప్రణాళికతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించా రన్నారు. ఇందులో భాగంగా, మా ప్రభుత్వం ప్రతి రైతు గడప వద్దకు వచ్చి వారి సమస్యలు తెలుసుకుని, ప్రభుత్వ పథకాలను వారికి వివరించి, వ్యవసాయంలో ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పిస్తోంది,” అని తెలిపారు. ప్రభుత్వ పథకాలు మరియు లక్ష్యాలు గురించి ఆమె మాట్లాడారు. జల భద్రత: ప్రతి పొలానికి నీరు అందించడమే లక్ష్యంగా, డ్రిప్ మరియు స్ప్రింక్లర్ వంటి ఆధునిక సాగునీటి పద్ధతులను ప్రోత్సహిస్తున్నాము. ఎస్సీ/ఎస్టీ రైతులకు 100% సబ్సిడీతో వీటిని అందిస్తున్నాము. సాంకేతిక పరిజ్ఞానం: వాతావరణ సమాచారం, పంటల ధరలు, పురుగుమందుల వాడకం వంటి వివరాలను రైతులు తమ ఫోన్‌లలోనే తెలుసుకునేలా యాప్‌లను అందుబాటులోకి తెచ్చాము. వ్యవసాయంలో డ్రోన్లు, ఆధునిక యంత్రాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాము. ఆహార శుద్ధి: మనం పండించిన పంటను నేరుగా అమ్మితే ఒక ధర వస్తుంది, అదే దానిని శుద్ధి చేసి, ప్యాక్ చేసి అమ్మితే ఇంకా ఎక్కువ ధర వస్తుంది. ఉదాహరణకు, టమాటాలను పండించి అమ్మడం కన్నా, వాటిని సాస్‌గా, పచ్చడిగా మార్చి అమ్మితే రెట్టింపు లాభం ఉంటుంది. దీనికోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి, చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకోవడానికి ప్రభుత్వం మీకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది. ప్రభుత్వ మద్దతు: ‘అన్నదాత సుఖీభవ’, ‘పీఎం-కిసాన్’ వంటి పథకాల ద్వారా రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందిస్తున్నాము. పంటల బీమా, గిట్టుబాటు ధర కల్పించడం, మరియు సేంద్రియ ఉత్పత్తుల కోసం రైతు బజార్లను బలోపేతం చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నాము. ఆదాయం రెట్టింపు: రైతుల ఆదాయాన్ని పెంచి, ఖర్చులను తగ్గించి, వారిని ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం,” అని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక నాయకులు, మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *