ఆంధ్ర రాష్ట్రం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి పొట్టి శ్రీరాములు

పయనించే సూర్యుడు న్యూస్, మార్చి17 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ.శివాజీ):పట్టణంలో నగర పంచాయతీ కార్యాలయం దగ్గర ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఉభయగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం వైస్ ప్రెసిడెంట్ గొల్లపూడి త్రిమూర్తులు,ఏలేశ్వరం మండలం ఆర్యవైశ్య అధ్యక్షుడు,సిహెచ్సి చైర్మన్ వాగు రాజేష్ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి సీనియర్ నాయకులు కౌన్సిలర్ అలమండ చలమయ్య,యువ నాయకులు బోదిరెడ్డి గోపి,మూది నారాయణస్వామి హాజరయ్యారు.ముందుగా విగ్రహానికి పాలాభిషేకం చేసి,పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రానికి చేసిన సేవలు మరుగులేనివని,58 రోజుల అమర నిరాహార దీక్ష చేసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి అని,తెలుగుజాతి గర్వించదగ్గ వ్యక్తి అని కొనియాడారు.అలాగే కూటమి ప్రభుత్వం అమరావతిలో పొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.పెనుగొండ ఊరు పేరును వాసవి పెనుగొండ గా మార్చిన ఘనత కూటమి ప్రభుత్వానిది అన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఎండగుండి నాగబాబు, మామిడి లలిత, రుచి రమేష్, కోణాల వెంకటరమణ,రాయుడు చిన్న,ఆర్యవైశ్యలు వాగు గున్నంరాజు, మట్టే సుబ్బారావు, శరణ్య శ్రీను, ప్రగళ్లపాటి పెదబాబు, ఎల్లంపల్లి దత్తుడు, రాతికింద సతీష్, వి.కామేష్, ఏ. శ్రీను, ఊర నానాజీ, వాగు బద్రిష్, పి.కామేష్, మణికంఠ, పి. సురేష్, వాగు రమేష్, నరసింహ, బలరాం, వినోద్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *