శ్రీ శ్రీ శ్రీ గంగాలమ్మ అమ్మవారి పునర్ ప్రతిష్ట మొదటి వార్షికోత్సవం..ఆలయ నిర్మాణానికి సహకరించిన వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు..

పయనించే సూర్యుడు మార్చి 17, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ ధర్మకర్త దంపతులు.. ప్రతి ఏడాది ఉగాదిని పురస్కరించుకొని ముందుగా కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామంలో వెలసిన శ్రీశ్రీశ్రీ గంగమ్మ అమ్మవారి ఆలయంలో కమిటీ పెద్దలు సభ్యులు నిర్వహణలో మూడు రోజులు పాటు ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా అమ్మవారికి రుద్రాభిషేకాలు, గరగ నృత్యాలు, తప్పిడి గుళ్ళు, తాడిపెద్ది సంబరాలు, చింతామణి డ్రామా, శక్తి వేసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కోలాటాలు , తాడి ఊరేగింపు అలాగే అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు, చండీయాగం రుద్రాభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ ధర్మకర్త ఉత్సవ కమిటీ చైర్మన్ మరియు గ్రామ మాజీ సర్పంచ్ గింజాల శ్రీనివాసరావు తెలియజేశారు. సోమవారం ఉదయం అమ్మవారి సమక్షంలో ఆలయ ధర్మకర్త గింజాల శ్రీనివాసరావు సత్య దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవ కార్యక్రమాలకి వాకలపూడి వలసపకళ గ్రామాలు ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలు భక్తులు వచ్చి అమ్మవారి దీవెనలు ఆశీస్సులు తీసుకోవాలని తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 16వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు అమ్మవారి ఏకాద ర రుద్రాభిషేకం తదుపరి సాయంత్రం 6 గంటలకు అమ్మవారికి కుంకుమ అర్చన సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జాతర రోజున ఉదయం 9 గంటలకు ఆలయ ప్రాంగణంలో చండీయాగం నిర్వహించడం జరుగుతుందన్నారు. 17వ తేదీ రాత్రి జాతర కార్యక్రమం లో భాగంగా నృత్యాలు తప్పుడు గుళ్ళు తాడిపెద్ద సంబరంలో కోలాటం శక్తి వ్యాసాలు, చింతామణి డ్రామా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 18వ తేదీ ఉదయం బుధవారం 9 గంటలకు, వలస పాకలో వాకలపూడి గ్రామాలలో నిర్వహించడం జరుగుతుందన్నారు సాయంత్రం నాలుగు గంటలకు 12 గంటల వరకు అమ్మవారి ప్రత్యక్ష పూజలో తో పాటు భక్తులందరూ సినిమాను మరియు సిరి బొమ్మ ఉత్సవాలు జరుగుతాయి అన్నారు. రాత్రి 12 గంటల 30 నిమిషాలకు అమ్మవారికి మహా కుంభ నైవేద్యం సమర్పణతో జాతర మహోత్సవ ముగింపు జరుగుతాయని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాతా లక్ష్మణ్, ఆలయ అర్చకులు మాత అంజిబాబు, నేరేళ్ల శ్రీనివాస్ మాధవి దంపతులు, కమిటీ సభ్యులు గింజాల తిరుమలరావు ప్రభావతి , కొల్లు బోయిన వీరబాబు, మఠం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *