బిజినపల్లి గ్రామ పంచాయతీ కార్మికులకు ఘన సన్మానం

కార్యక్రమంలో సర్పంచ్ ఇందిరా రాములు ఉపసర్పంచ్ మహేష్ కార్యదర్శి పవన్ కుమార్

పయనించే సూర్యుడు మార్చి 17 నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా స్వచ్ఛమైన గ్రామాల కోసం అంకితభావంతో పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులను సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. గ్రామ సర్పంచ్ మిద్దె ఇందిర రాములు మరియు పాలకవర్గ సభ్యులు కలిసి కార్మికులకు శాలువాలు కప్పి అభినందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మిద్దె ఇందిర రాములు మాట్లాడుతూ గ్రామంలో ప్రతిరోజూ పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి వీధులను పరిశుభ్రంగా ఉంచుతున్న మల్టీపర్పస్ కార్మికుల సేవలు ఎంతో గొప్పవని, వారి కృషి వల్ల గ్రామం పరిశుభ్రంగా మారుతోందని అన్నారు. గ్రామ అభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గడ్డమీద మహేష్, పంచాయతీ కార్యదర్శి పవన్ కుమార్, వార్డు సభ్యులు బెల్ల శివలింగం, మంగి శాంతయ్య, జిల్లెల్ల స్నేహ, కళ్యాణ్ కారి నేతాజీ, రంగా నరేందర్, చిర్నం రాజేశ్వరి, పాత్లవాత్ పాండు, ప్రజాప్రతినిధులు కంపిల్ల మల్లయ్య, జాజాల ఆంజనేయులు, ఇరుగంటి నరసింహ, చీర్ణం పరమేష్, గ్రామపంచాయతీ సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *