పయనించే సూర్యుడు మార్చి 17 నాగర్ కర్నూల్ జిల్లా బిజినాపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ బిజినపల్లి మండలం పోలేపల్లి గ్రామంలో ఈరోజు సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. నాగర్కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ పనులను ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడం వల్ల ప్రజలకు రాకపోకలు సౌకర్యవంతంగా మారుతాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, మాధవి నరసింహ ఉప సర్పంచ్, భాను ప్రకాష్ కాంట్రాక్టర్ శ్రీశైలం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహేందర్, హనుమ నాయక్, మాజీ డిప్యూటీ సర్పంచ్ శీను వార్డ్ మెంబర్లు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.