పయనించే సూర్యుడు మార్చి 17 కరీంనగర్ న్యూస్: గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అడ్డగోలు హామీలు ఇచ్చిందని, ముఖ్యంగా ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని ప్రజలను నమ్మించి నిలువునా మోసం చేసిందని , కాంగ్రెస్ సర్కార్ 6 గ్యారెంటీలు ఆన్ గ్యారంటీగా మారాయని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి, సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులు బొంతల కళ్యాణ్ చంద్ర ఘాటుగా విమర్శించారు. బిజెపి రాష్ట్ర శాఖ పిలుపుమేరకు సోమవారం రోజున బిజెపి తిమ్మాపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టి, తహసిల్దార్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బొంతల కళ్యాణ్ చంద్ర మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లయిన 6 గ్యారంటీలను అమలు చేయలేని దౌర్భాగ్య పరిస్థితిల్లో ఉందన్నారు. నాడు అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చి నేడు ఇచ్చిన వాగ్దానాలు, హామీల పై దాటవేత ధోరణి ప్రదర్శిస్తుందన్నారు. ముఖ్యంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఒక ఫ్రీ బస్సు ను కల్పించి మహిళలకు ప్రతి నెల రూ. 2500 , రూ. 500 కే గ్యాస్ సిలిండర్ ను ఎగ్గొట్టిందన్నారు’ రైతు భరోసా”కు భరోసా లేకుండా పోయిందన్నారు. రైతు భరోసా అందించడానికి అనేక కొర్రీలు పెడుతూ రైతాంగాన్ని తీవ్రంగా మోసం చేసిందన్నారు. రైతు కూలీల రైతు భరోసా కు మంగళం పాడిందన్నారు. ప్రధానంగా ఎన్నికల సందర్భంగా మ్యానిఫెస్టోలోరూ.15 వేల రైతు భరోసా అందిస్తామని ప్రకటించి రూ.12 వేలకు కుదింపు చేసి రైతాంగాన్ని తీవ్రంగా మోసం చేసిందన్నారు.యువ వికాస పథకాన్ని గాలికి వదిలేసిందన్నారు.5 లక్షల విద్యా భరోసా కార్డు ఇంటర్నేషనల్ స్కూల్స్ ల ఏర్పాటు పత్తా లేకుండాపోయిందన్నారు.చేయూత ” పథకానికి కాంగ్రెస్ సర్కార్ చేయించిందని, పెన్షన్లను పెంచుతామని పెన్షన్ దారులను తీవ్రంగా మోసం చేసిందన్నారు. రూ. 4000 పెన్షన్ ఇవ్వడానికి హస్తం పార్టీకి చేతులు రావడం లేదని ఆయన ఘాటుగా విమర్శించారు. ఇందిరమ్మ ఇండ్లు, ఇడ్ల స్థలం ఉన్నవారికి 5 లక్షల ఆర్థిక సాయం, తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అటకెక్కిచ్చిందన్నారు. గృహజ్యోతి పథకం కింద అర్హులైన వారికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే స్కీంను తూతూ మంత్రంగా అమలు చేసి చేతులు దులుపుకుందన్నారు. ఆరూగ్యారంటీలను అమలు చేయలేని కాంగ్రెస్ సర్కార్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని , రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా 6 గారంటీలను సక్రమంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 6 గ్యారంటీల అమలు కోసం బీజేపీ ప్రజల కు అండగా నిలుస్తుందని, ఎలాంటి పోరాటానికైనాసిద్ధంగా ఉంటుందని చెప్పారు. ఆరూ గ్యారెంటీ ల అమలు చేసేదాకా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విడిచిపెట్టే ప్రసక్తి లేదని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.జిల్లా నాయకులు చింతం శ్రీనివాస్, బూట్ల శ్రీనివాస్, కొయ్యడ శ్రీనివాస్, ఎర్రోజు లక్ష్మణ్ , పాశం రాఘవరెడ్డి, బోనాల మోహన్, ఓ బి సి మోర్చా మండల అధ్యక్షులు దురిశెట్టి రమేష్, ఎస్సీ మోర్చా అధ్యక్షులు ఎలుక పెళ్లి స్వామి, మండల జనరల్ సెక్రెటరీ గొట్టుముక్కల తిరుపతిరెడ్డి. సీనియర్ నాయకులు వేల్పుల ఓదెలు, పబ్బతిరుపతి, సత్తయ్య కుమార్, హరిక్రిష్ణ కమెరా వెంకటేష్ ,అజయ్, ఈశ్వర చారి జాడి రాజు, రాఘవ రెడ్డి అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.