వంద శాతం పన్నులు వసూలు చేయాలి * సాలుర మండల ఎంపీడీవో శ్రీనివాస్

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 17 బోధన్ :సాలూర మండలంలోని గ్రామ పంచాయతీలో వంద శాతం ఇంటి పన్ను వసూళ్లే లక్ష్యంగా ఎంపీడీవో శ్రీనివాస్ ఆద్వర్యంలో సోమవారం హున్స గ్రామంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ శ్రీనివాస్, సర్పంచ్ శివకుమార్ లు మాట్లాడుతూ… ఆర్థిక సంవత్సరం ముగింపు దశలో ఉన్న నేపథ్యంలో నెలాఖరులోగా వంద శాతం పన్నులను వసూలు చేసి గ్రామాభివృద్ధికి సహకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గ్రామంలో చేపట్టే మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్య నిర్వహణ, వీధిదీపాల ఏర్పాటు మరియు మంచినీటి సరఫరా వంటి నిత్యవసర పనులన్నీ ప్రజలు చెల్లించే పన్నుల ద్వారానే సాధ్యమవుతాయని వారు వివరించారు. ప్రజలు బాధ్యతగా పన్నులు చెల్లించి గ్రామాన్ని ఆదర్శంగా నిలపాలని ఆయన కోరారు. పన్ను వసూలు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, ప్రతి రూపాయికి రశీదు అందిస్తున్నామని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న బకాయిలను సైతం తక్షణమే చెల్లించాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శివకుమార్ పంచాయతీ కార్యదర్శి, శ్రీనివాస్ గ్రామ పెద్దలు శంకర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *