అట్టేపల్లి రామప్రభు ఆధ్వర్యంలో ఘనంగా మహిళాదినోత్సవ వేడుకలు అతిథిగా హైడ్రా కమిషనర్రంగనాథ్

పయనించే సూర్యుడు, మార్చి 17 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (ఎస్ఎంకుమార్) అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మియాపూర్ డివిజన్ పరిధిలో అట్టేపల్లి లక్ష్మీనారాయణ చారి టబుల్ ట్రస్ట్ చైర్మన్అట్టేపల్లి రామప్రభు, పురుషోత్తం ఆధ్వర్యంలో మహిళల కోసం విశేష కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. గత 15 రోజులు గా మియాపూర్ పరిధిలోని వివిధ కాల నీలలో మహిళల కోసం వినోదాత్మక గేమ్స్ , ప్రతిభా పోటీలు నిర్వహించి మహిళలలోని ప్రతిభను వెలికితీయ డానికి ప్రత్యేక ప్రయత్నం చేశారు.ఈ పోటీలలో విజేతలకు మొత్తం 24 మొదటి బహుమతులు (ప్రతి ఒక్క రికీ రూ.5,000 విలువైన బహుమతి) మరియు 24 రెండవ బహుమతులు (ప్రతి ఒక్కరికీ రూ.3,000 విలువైన బహుమతి) అందజేశారు.అదనంగా పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళకు ప్రోత్సా హకంగా చీరలను పార్టిసిపేషన్ గిఫ్ట్‌లుగా 800 వందలు మందికి అందజేసారు.మ హిళ మహారాణి మహిళ సంకల్పిస్తే ఏదై నా సాధ్యం అనే సందేశం తో నిర్వహించి న ఈ కార్యక్రమం మియాపూర్‌ లోని ప్రగతి ఎంక్లేవ్ కమ్యూనిటీ హాల్లో ఉద యం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యంత వైభవంగా జరిగింది.కార్యక్రమంలో బహుమతి ప్రదానోత్సవం విందు కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఇదే సందర్భంగా మియాపూర్ ప్రాంత ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఉచిత అంబులెన్స్ సేవలను ప్రారంభించారు. ఈ సేవను హైడ్రా కమిషనర్ రంగనాథ్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమా నికి ముఖ్య అతిథులుగా హైడ్రా కమి షనర్ రంగనాథ్, ప్రిన్సిపల్ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్ కె మధు సూదన్,అర్జున అవార్డు గ్రహీత జీవంజీ దీప్తి, డాక్టర్ జె బి రావు మియాపూర్ లా అండ్ ఆర్డర్ ఎస్. ఐ వెంకటేష్,కిమ్స్ ఆసుపత్రి గైనకాలజిస్ట్ డాక్టర్ కావ్య ప్రియ,మియాపూర్ జడ్పీ హెచ్‌ఎస్ ప్రిన్సిపాల్ వసుంధర,మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు చంద్రిక ప్రసాద్ బోయిని మహేష్ యాదవ్,నిమ్మల రామకృష్ణ గౌడ్,మోహన్ ముదిరాజ్, మువ్వ సత్యనారాయణ, పురుషోత్తం యాదవ్, ఓం ప్రకాష్ కృష్ణ పటేల్,డి ఎస్ ఆర్ కె ప్రసాద్, బాబ్జి, సుధీర్,వినయ్ ముదిరాజ్, శ్రీకాంత్ యాదవ్,తదితర ప్రముఖులు ఏ ర్ పి టీం సబ్యులు, అట్టేపల్లి కుటుంబ సభ్యులు పాల్గొన్నా రు.దాదాపు 1300 మంది ఈ కార్యక్ర మంలో పాల్గొని వేడు కలను విజయ వంతం చేశారు.ఈ సందర్భంగా అట్టేపల్లి రామప్రభు మాట్లాడుతూ. మ హిళలు సమాజ అభివృద్ధికి పునాది,మహిళ సాధికారతే దేశ అభివృ ద్ధికి మార్గం అని తెలిపారు.ఇంత భారీ స్థాయిలో మహిళలు పాల్గొని కార్యక్రమా న్ని విజయవంతం చేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందని పేర్కొంటూ, పాల్గొ న్న ప్రతి మహిళకు ధన్యవాదాలు తెలియజేసి మహిళా దినోత్సవ శుభా కాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *