పయనించే సూర్యుడు, మార్చి 17 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (ఎస్ఎంకుమార్) రంజాన్ మాసం పర్వదినంను పుర స్కరించుకుని మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ కాలనీలో గల మసీదు వద్ద జరిగిన బట్టల పంపిణీ కార్యక్రమంలో తాజా మాజీ కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్,నార్నె శ్రీనివాసరావులతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ముస్లిం సోదర సోదరీమణులకు బట్టలను పంపి ణి చేసిన పి ఎ సి చైర్మన్ ఆరెకపూడి గాంధీ.ఈ సందర్భంగా పి ఎ సి చైర్మన్ గాంధీ మాట్లాడుతూ రంజాన్ మాసం చాలా పవిత్రమైనది అని,రంజాన్ మాసం సందర్భంగా నిష్ఠతో పాటించే ఉపవాస దీక్షలు, దెైవ ప్రార్థనలతో సామ రస్యం, శాంతి సౌభ్రాతృత్వం వెల్లివిరి యాలని ఆకాంక్షించారు.రంజాన్ పర్వ దినం ను పురస్కరించుకుని ముస్లిం సోదర సోద రిమణులకు పండుగను ధనిక ,పేద బేధం లేకుండా సుఖసంతో షాలతో జరుపుకునేందుకు వీలుగా ముఖ్య మంత్రి వర్యులు రేవంత్ రెడ్డి పెద్ద మనస్సుతో బట్టల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగినది అని,వారి కుటుం బాలలో సంతోషం వెల్లివిరియాలనే ఉద్దేశ్యంతో బట్టల పంపిణీ చేపట్టడం జరిగినది అని,ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్ని మతాలను సమానం గా చూస్తు న్నారు అని, రంజాన్ మాసం ఉపవాసం తో మంచి తనం ,సం స్కారం అలవడుతుందని,మతసామరస్యానికి ప్రతీక,అందరూ కల్సి ఉండాలని,ప్ర భుత్వం ముస్లింల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగినది అని,ముస్లింల అభివృద్ధికి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నా రని ,పేద ముస్లిం కుటుంబా లకు పండుగ రోజున వెలితి లేకుం డా,వారికీ ఎటు వంటి లోటులేకుండా పండుగను సంతో షకరంగా జరుపుకో వాలని చెప్పడం జరిగినది.రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించేందుకు మసీదులకు ఈదుగలకు అభివృద్ధి మరమ్మతులకు నిధులు కేటాయించడం, పండుగ సంద ర్భంగా పేదలకు దుస్తులు పంపిణీ చేయనున్నట్లు అదేవిధంగా కుల మతం జాతి భేదం లేకుండా తెలంగాణ జాతి అంతా ఒకటే అని ఆ అల్లా కరుణక టా క్షాలు పొందేం దుకు అల్లా కృపకు దగ్గర కాగ లమనేది ప్రతి ముస్లిం సోద రుల ప్రగాఢ విశ్వాస ము అందుకే ఎంతో భక్తి శ్రద్ధలతో రంజాన్ నెల మాసాన్ని పురస్క రించుకు ని నియమ నిబంధన లు పాటించి ఉప వాస కఠోర దీక్షతో ప్రార్థనలు చేస్తారు.ఈ విధమైన ఆధ్యా త్మిక దైవ ప్రార్ధనలతో శాంతి,సోదర భావం,సౌభ్రా తృత్వానికి రంజాన్ ప్రతీక అని పి ఎ సి చైర్మన్ గాంధీ తెలి యచేసారు.ఈ కార్యక్రమంలో నా యకులు కార్యకర్తలు,ముస్లిం మత పెద్దలు,ముస్లిం సోదరులు తదిత రులు పాల్గొన్నారు.