కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి

తహసీల్దారు కార్యాలయం ముందు నిరసన తెలిపిన వినతిపత్రం ఇచ్చిన బిజెపి నాయకులు

పయనించే సూర్యుడు మార్చి 18 శంకరపట్నం మండలం రిపోర్టర్ పెద్ది గట్టయ్య : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి మేనిఫెస్టోలో ఏర్పాటు చేసిన 6 గ్యారంటీలను పూర్తి స్థాయిలో అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తుందని బిజెపి మండల అధ్యక్షుడు ఎనుగుల అనిల్ ఆద్వర్యంలో శంకరపట్నం మండల తహసీల్దారు కార్యాలయం ముందు బిజెపి నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అనీల్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 2500 రూ.లు, వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు పెన్షన్ల పెంపకం, చదువుకునే యువతులకు స్కూటీలు పంపిణీ,‌ కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు తులం బంగారం వంటి పథకాలు అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందని, పంటలు పొట్టదశకు చేరుకున్న ఇప్పటికీ రైతు భరోసా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలుపరచాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బిజెపి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమంలో నిర్వహిస్తామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దారు కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి అలివేలు సమిరెడ్డి, నాయకులు దొంగల రాములు, కొయ్యడ కుమార్, దాసారపు నరెందర్, మందాడి జగ్గారెడ్డి రాసమల్ల శ్రీనివాస్, సుధగోని శ్రీనివాస్, రాజిరెడ్డి వీరార్జున్, బిజిలి సారయ్య, అంతం రాజిరెడ్డి, గౌరవేణి శ్రీనివాస్, పోతునూరి రాజు, వెంగళ ప్రవీణ్ పంజాల అనిల్, బోడ తిరుపతిరెడ్డి,రాజు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *