రైతులకు గుడ్ న్యూస్: రైతు భరోసా పథకంలో కొత్త అవకాశాలు

"వ్యవసాయ విస్తరణ అధికారి ఏఈఓ సంతోష్ కుమార్ తెలిపారు"

పయనించే సూర్యుడు మార్చ్ 18 రాజేష్ దల్తాబాద్) దొమ్మాట క్లస్టర్ పరిధిలోని రైతులకు సంతోషకరమైన సమాచారం అందింది. వ్యవసాయ విస్తరణ అధికారి (ఏ ఈ ఓ) సంతోష్ కుమార్ తెలిపారు యాసంగి 2025-26 సీజన్‌కు సంబంధించి రైతు భరోసా పథకంలో కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. 2026 ఫిబ్రవరి 28 నాటికి కొత్తగా పట్టాదారు పాస్‌బుక్ పొందిన రైతులు ఇప్పుడు రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం దరఖాస్తు ఫారం నింపి, పట్టాదారు పాస్‌బుక్, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలతో తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారికి సమర్పించాలి. ఈ ప్రక్రియకు చివరి తేదీ 25 మార్చి 2026గా నిర్ణయించారు. ఇప్పటికే ఈ పథకం లబ్ధి పొందుతున్న రైతులకు కూడా శుభవార్త ఉంది. వారు తమ బ్యాంకు ఖాతా వివరాలను మార్చుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. ఖాతా మార్పు చేయాలనుకునే వారు కొత్త బ్యాంకు వివరాలతో వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించవచ్చు. ఈ సేవకు కూడా చివరి తేదీ 25 మార్చి 2026గా ఉంది. అర్హులైన రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని గడువులోపు దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ విస్తరణ అధికారి సూచించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *