
పయనించే సూర్యుడు బాపట్ల మార్చి 18 :-రిపోర్టర్ (కే శివకృష్ణ ) బాపట్ల మండలం ముత్తాయి పాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు ఆదేశాల ప్రకారం శక్తి టీం ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు “గుడ్ టచ్ -బ్యాడ్ టచ్” అంశంపై అవగాహన సదస్సు నిర్వహించడమైనది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు గురజాల శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులకు బాల్య దశలోనే “గుడ్ టచ్ బ్యాడ్ టచ్” గురించి అవగాహన కలిగించుట తద్వారా ఇతరుల మోసాలకు బలికాకుండా ముఖ్యంగా బాలికలు తమను తాము కాపాడుకోగలుగుతారని అన్నారు. శక్తి టీం లీడర్ ఏ ఎస్ ఐ సుభాని సాహెబ్ మాట్లాడుతూ నో, గో, టెల్ పదాలను గుర్తు పెట్టుకొని అనగా ఇతరులు ముట్టుకోకుండా, చెడు వ్యక్తులకు దూరంగా, బ్యాడ్ టచ్ జరిగితే తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు చెప్పాలి. ప్రతి విద్యార్థి పై మూడు విషయాలను గమనంలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని కోరినారు. శక్తి టీం మహిళ పోలీస్ కానిస్టేబుల్ బాలికలకు, మహిళలకు ఇతరుల నుండి ఇబ్బంది కలిగినట్లయితే 190 ఈ ఫోన్ చేసి తమను సంరక్షించుకోవాలని కోరినారు. పై కార్యక్రమంలో పోలీస్ కానిస్టేబుల్ బాణావతి కుటుంబ నాయక్,పాఠశాల సహోపాధ్యాయులు సిహెచ్ రమాదేవి,బి విజయలక్ష్మి, డి వందనకుమారి పాఠశాల యాజమాన్య కమిటీ చైర్పర్సన్ కర్రి.అరుణ బాల బాలికలు పాల్గొన్నారు. శక్తి టీం వారు ప్రదర్శించిన ” గుడ్ టచ్,బ్యాడ్ టచ్” పోస్టర్లు అందర్నీ ఆలోచింపజేసినవి.