గ్రామదేవత మాతృశ్రీ బాపనమ్మ తల్లిని దర్శించుకున్న ఆదివాసీ నాయకులు.

పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ మర్చి. 18.2026 ఈ సందర్భంగా ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ మాట్లాడుతూ పోలవరం జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం, దేవీపట్నం మండల పరిధిలోని దేవారం గ్రామంలో ఉన్న గ్రామదేవత మాతృశ్రీ బాపనమ్మ తల్లి పండుగ, పప్పు కొత్త పండుగ సందర్భంగా గ్రామ దేవత మాతృశ్రీ బాపనమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. ముందుగా గ్రామంలోని ఆలయ పూజారి తెల్లం బాపన దొర.ఆధ్వర్యంలో గ్రామస్తులందరూ మాతృశ్రీ బాపనమ్మ తల్లిని ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారన్నారు. మాతృశ్రీ బాపనమ్మ తల్లిని దర్శించుకొని ప్రజలు ఘనంగా నైవేద్యం సమర్పించారన్నారు. అనంతరం గ్రామంలోని చిన్నలు, పెద్దలు, మహిళలు, యువతీ యువకులు అందరికి అన్నసంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తెల్లం కామన్న దొర, తెల్లం రామకృష్ణ దొర, తెల్లం నరేంద్ర దొర, తెల్లం మహేష్ దొర, మడకం మోహన్ రావు దొర, కారం రమేష్ దొర, కొమరం కుమార్ స్వామి దొర, కోసు శేఖర్ దొర, కోసు వెంకటేష్ దొర, పూసం వీరాంజనేయులు దొర, శారపు వీరబాబు దొర, ఎంపిటిసి సభ్యులు తుర్రం జగదీష్ దొర, కొమరం దుర్గాప్రసాద్ దొర మొదలైన వారు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *