పయనించే సూర్యుడు న్యూస్ :మార్చి 18, తల్లాడ రిపోర్టర్ తల్లాడ మండలం పాత మిట్టపల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎంఇఓ మోరంపూడి సత్యనారాయణ మృతి పట్ల బీఆర్ఎస్ మాజీ లోక్సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన స్వగృహానికి చేరుకుని సత్యనారాయణ పార్ధివ దేహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు. అనంతరం వారి సోదరుడు మోరంపూడి ప్రసాద్ రావు తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట జిల్లా బీఆర్ఎస్ నాయకులు తాళ్లూరు జీవన్ కుమార్, తల్లాడ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రెడ్డెం వీరమోహన్ రెడ్డి, మాజీ ఎంపీపీ దొడ్డ శ్రీను, దుగ్గిదేవర అజయ్, బీఆర్ఎస్ నాయకులు నాయుడు శ్రీనివాసరావు, మాజీ ఎంపీటీసీ కనకయ్య, శెట్టిపల్లి లక్ష్మణరావు, వెంకటరెడ్డి, వాకదాని కోటేశ్వరరావు, రేగళ్ల కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.